కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి తనయులు | naresh ,rakesh joining in t congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ లో చేరిన మాజీమంత్రి తనయులు

Published Wed, Apr 13 2016 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

naresh ,rakesh joining in t congress

నరేష్, రాకేష్‌లకు కండువా కప్పిన దిగ్విజయ్‌సింగ్
తాండూరు : టీడీపీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మల్కూడ్ నరేష్, ఆయన సోదరుడు, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మల్కూడ్ రాకేష్‌లు మంగళవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో సోదరులకు దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్  కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. తాండూరు నియోజకవర్గం నుంచి తన అనుచరులతో కలిసి వారు కాంగ్రెస్‌లో చేరారు.

 2014 శాసనసభ సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎం చంద్రశేఖర్ తనయులు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. 25 నెలలుగా టీడీపీలో కొనసాగిన సోదర ద్వయం మళ్లీ సొంతగూటికి చేరారు. కార్యక్రమంలోమాజీ హోంమంత్రి సబితారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం నారాయణరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ సునీత, కౌన్సిలర్లు ఎం శ్రీనివాస్, లింగదళ్లి రవికుమార్, పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసాచారి, డీపీసీ మాజీ సభ్యులు పట్లోళ్ల నర్సిం హులు, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement