జాతీయ కబడ్డీ పోటీల్లో రాజేష్‌కు స్వర్ణం
Published Mon, Jan 23 2017 10:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
సామర్లకోట :
ఇటీవల నెల్లూరులో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో సామర్లకోట బచ్చు ఫౌండేష¯ŒS మున్సిపల్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి ఎర్రంశెట్టి రాజేష్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో పంజాబ్‌పై ఆంధ్రా కబడ్డీ జట్టు విజయం సాధించి, ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాజేష్‌కు పోటీల నిర్వాహకులు బంగారు పతకం అందజేశారు. అతడిని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ, పీఈటీ మానం వెంకటేశ్వరరావు సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా రాజేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, కబడ్డీపై 8వ తరగతిలో మక్కువ ఏర్పడి, జిల్లా కబడ్డీ అసోసియేష¯ŒS అధ్యక్షుడు బోగిళ్ల మురళీకుమార్ ద్వారా శిక్షణ పొందానని చెప్పాడు. గత డిసెంబరు 28 నుంచి 30 వరకూ కాకినాడలో జరిగిన ఖేలో ఇండియా అండర్–14 కబడ్డీలో రజత పతకం సాధించాడు. స్కూల్ గేమ్స్ అండర్–17 తరఫున ఆడి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. తండ్రి భీమరాజు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రికి అండగా ఉండటానికి వేసవి సెలవుల్లో తాపీ పనికి కూడా వెళుతున్నాడు. కబడ్డీలో ప్రతిభ చూపి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని ఉందని చెప్పారు.
Advertisement
Advertisement