kabaddi competition
-
తిరుపతి వేదికగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
-
కబడ్డీ పోటీలు: పాట పాడిన ఎమ్మెల్యే భూమన
తిరుపతి తుడా: లే..పంగా..లే..పంగా అంటూ కబడ్డీ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రో కబడ్డీని ఉన్నత స్థానానికి చేర్చిన బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ గానం అప్పట్లో ఓ మైలురాయిగా నిలిచింది. తిరుపతి వేదికగా నిర్వహిస్తోన్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ‘తెగువకు తెగువకు రణరణ సమరం..లే..పంగా కబడ్డీ కబడ్డీ ఖే లో కబడ్డీ’ అంటూ నూతనంగా రచించిన ఈ గీతాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆలపించగా తిరుపతి మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గొంతు కలిపారు. చదవండి: శభాష్ విజయ్.. యోగాలో గిన్నిస్ రికార్డ్ తిరుపతిలోని ఓ రికార్డింగ్ స్టూడియోలో ఈ పాటను ఆదివారం రికార్డు చేశారు. తిరుపతిలో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కబడ్డీ క్రీడ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలు డే అండ్ నైట్ మ్యాచ్‌లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెడ్లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్‌లు నగర వాసులకు కొత్తదనాన్ని అందించనున్నాయన్నారు. -
జాతీయ కబడ్డీ పోటీల్లో రాజేష్‌కు స్వర్ణం
సామర్లకోట : ఇటీవల నెల్లూరులో జరిగిన జాతీయ స్థాయి ఖేలో ఇండియా కబడ్డీ పోటీల్లో సామర్లకోట బచ్చు ఫౌండేష¯ŒS మున్సిపల్ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి ఎర్రంశెట్టి రాజేష్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో పంజాబ్‌పై ఆంధ్రా కబడ్డీ జట్టు విజయం సాధించి, ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాజేష్‌కు పోటీల నిర్వాహకులు బంగారు పతకం అందజేశారు. అతడిని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ, పీఈటీ మానం వెంకటేశ్వరరావు సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా రాజేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, కబడ్డీపై 8వ తరగతిలో మక్కువ ఏర్పడి, జిల్లా కబడ్డీ అసోసియేష¯ŒS అధ్యక్షుడు బోగిళ్ల మురళీకుమార్ ద్వారా శిక్షణ పొందానని చెప్పాడు. గత డిసెంబరు 28 నుంచి 30 వరకూ కాకినాడలో జరిగిన ఖేలో ఇండియా అండర్–14 కబడ్డీలో రజత పతకం సాధించాడు. స్కూల్ గేమ్స్ అండర్–17 తరఫున ఆడి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. తండ్రి భీమరాజు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రికి అండగా ఉండటానికి వేసవి సెలవుల్లో తాపీ పనికి కూడా వెళుతున్నాడు. కబడ్డీలో ప్రతిభ చూపి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించాలని ఉందని చెప్పారు. -
కబడ్డీ పోటీలకు రంగంపేట విద్యార్థిని
కొల్చారం, న్యూస్‌లైన్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రంగంపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వినోద ఎంపికైనట్టు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎండీ గౌసొద్దీన్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో జరిగిన జిల్లాస్థాయి బాలికల కబడ్డీ పోటీలో వినోద ప్రతిభ కనబర్చడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈనెల 15న కృష్ణా జిల్లా గుడివాడలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.