విధులను విస్మరిస్తే చర్యలు తప్పవు
విధులను విస్మరిస్తే చర్యలు తప్పవు
Published Sun, Jan 1 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 AM
ఏలూరు (మెట్రో) : ప్రజలకు అందుబాటులో లేకుండా విధులు సక్రమంగా నిర్వర్తించని డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.కోటేశ్వరి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శనివారం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సమస్యలపై ప్రజలతో కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడాల్సి ఉండగా అదే సమయంలో ముఖ్యమంత్రితో టెలీ కాన్ఫెరెన్‌స ఉండటంతో డీఎంహెచ్‌వో కోటేశ్వరి ప్రజల నుంచి ఫోన్‌ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
చింతలపూడి నుంచి సుదర్శన్‌అనే వ్యక్తి ఫోన్ చేసి చింతలపూడిలోని పీహెచ్‌సీలతో పాటు చుట్టుపక్కల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొందరు వైద్యులు ఉదయం 8 గంటలకు వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్లిపోతున్నారని, మరలా సాయంత్రం 4 గంటలకు హాజరు వేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. డాక్లర్ల స్థానంలో వేరొకరిని ఉంచడంతో ప్రజలకు సరైన వైద్యం అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పం దిస్తూ దీనిపై తాను విచారణ చేయిస్తానని ఎవరైనా డాక్టర్లు విధులకు హాజరుకాకపోయినా, బయోమెట్రిక్ వేసి అందుబాటులో లేకపోయినా చర్యలు తప్పవని చెప్పారు.
నరసాపురం నుంచి దుర్గ అనే మహిళ ఫోన్‌లో మాట్లాడుతూ తాను చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, సరైన వైద్యం అందించాలని కోరింది. డీఎంహెచ్‌వో స్పందిస్తూ వెంటనే నరసాపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని అక్కడ వైద్యులు పరీక్షించి ఉచితంగా వైద్యం అందిస్తారని ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.
కామవరపుకోట మండలం నుంచి కో లన పెంటయ్య అనే వ్యక్తి మాట్లాడు తూ గత నెల 13న తన మావయ్య మ హాలక్ష్మణుడు ఏలూరు ఆసుపత్రిలో మరణించారని ఆ రోజు డ్యూటీ డాక్టర్ ఆర్‌వీఐ రమణ రసీదు ఇచ్చారని డెత్ సర్టిఫికెట్ కోసం మీ సేవకు వెళితే ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని చెబుతున్నారన్నారు. దీంతో డెత్ సర్టిఫికెట్ రావడం లేదన్నారు. దీనిపై డీఎంహెచ్‌వో స్పందిస్తూ మీ సేవ ద్వారా డెత్‌సర్టిఫికెట్ అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ కె.శంకరరావు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ వెంకట్రావు, జిల్లా అదనపు డీఎంహెచ్‌వో పాల్గొన్నారు.
Advertisement
Advertisement