29న నెట్‌బాల్ జిల్లా జట్లు ఎంపిక
Published Sat, Aug 27 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
మహబూబ్‌నగర్ క్రీడలు : 62వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో పాల్గొనే 14, 17 సంవత్సరాల విభాగాల బాలబాలికల నెట్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 29వ తేదీన స్థానిక టీడీ గుట్ట హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి టి.సురేశ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే ఎంపిక కన్వీనర్‌గా ఆ స్కూల్ పీఈటీ వి.రాములు వ్యవహరిస్తారని, ఆసక్తి ఉన్న బాలబాలికలు ఈ ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
Advertisement
Advertisement