కసాపురం (గుంతకల్లు రూరల్) : శ్రావణమాసం ఉత్సవాల ద్వారా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కోటీ 55వేల 416 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఆలయంలోని కార్యాలయంలో ఆలయ ఏఈవో మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఈ వివరాలను వెల్లడించారు. శ్రావణమాసం నాలుగు శనివారాలు, మంగళవారాలు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు.
ఆలయంలో లడ్డు, పులిహోర, కలకండ, అభిషేకం లడ్డు ప్రసాదాల కొనుగోళ్ల ద్వారా భక్తులు రూ.30,74,085 , అద్దెగదుల ద్వారా రూ. 3,63,980 , హనుమాన్ కంకణాల ద్వారా 1,76,810 , రూ. 10 సాధారణ దర్శనం టికెట్లు, రూ.50 శీఘ్ర దర్శనం టికెట్లు, రూ.100 అతిశీఘ్ర దర్శనం టికెట్ల కొనుగోళ్ల ద్వారా రూ.31,02,327 అందాయన్నారు.
ఆర్జిత సేవలద్వారా 12,72,915 , కేశఖండన ద్వారా రూ. 2,75,600, అన్నదానానికి భక్తులు అందజేసిన డొనేషన్ల ద్వారా రూ.5,26,017, దుకాణ సముదాయాల ద్వారా 11,22,954 ఆదాయం లభించినట్లు వివరించారు. నెల ఉత్సవాల్లో తమవంతు సహాయసహకారాలు అందజేసిన ప్రభుత్వ వివిధ శాఖలు, సేవాసమితి సభ్యులకు వారు కతజ్ఞతలు తెలిపారు.
శ్రావణమాస ఆదాయం రూ.1.05 కోట్లు
Published Sun, Sep 4 2016 11:11 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement