కొత్త జంటలతో శ్రీవారిక్షేత్రం కళకళ | NEW COUPLES IN SRIVARIKHESTRAM | Sakshi
Sakshi News home page

కొత్త జంటలతో శ్రీవారిక్షేత్రం కళకళ

Published Sun, Aug 7 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

కొత్త జంటలతో శ్రీవారిక్షేత్రం కళకళ

కొత్త జంటలతో శ్రీవారిక్షేత్రం కళకళ

ద్వారకాతిరుమల :   పెళ్లి జనాలు, నూతన వధూవరులతో చినవెంకన్న క్షేత్రం ఆదివారం కళకళలాడింది. పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలుండటంతో క్షేత్రం బాజాభజంత్రీలతో మారుమోగింది. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, కల్యాణ మండప ప్రాంతంలో ఉదయం పలు వివాహాలు జరిగాయి. అలాగే దూరప్రాంతంలో వివాహాలు చేసుకున్న నూతన వధూవరులు, వారి బంధువులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల తిరుపతి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన వివిధ భజనమండళ్లు ఆదివారం ఆలయంలో ప్రదర్శించిన కోలాట భజనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement