నూతన విధానం విద్యావ్యవస్థకు చేటు
నూతన విధానం విద్యావ్యవస్థకు చేటు
Published Sun, Mar 19 2017 10:06 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
కర్నూలు సిటీ: నూతన విద్యా విధానం-2016లో భాగంగా రూపొందించిన ప్రతిపాదనలు విద్యా వ్యవస్థను దెబ్బతిసేలా ఉన్నాయని ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గోవింద రాజులు అన్నారు. స్థానిక మద్దూరునగర్‌లోని పింగళి సూరన తెలుగు తోటలో నూతన విద్యా విధానం-2016 ప్రతిపాదనలు, విద్యా రంగంపై ప్రభావం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గోవిందరాజుతోపాటు ఆర్‌యూ ప్రొఫెసర్ డా.గీతాసేత్, ప్రభుత్వ బీఎడ్, డైట్ కాలేజీల ప్రిన్సిపాల్స్ డా.పార్వతిదేవి, మున్నయ్య, రిటైర్డ్ అధ్యాపకులు డా.అబ్దుల్ హాక్, డా.ఎ కృష్ణ తదితరులు ప్రసంగించారు. విద్యను వ్యాపారంగా మార్చారని, విద్యరంగంతో సంబంధం ఉన్న వారితో కాకుండా ఇతరులతో కలిసి నూతన విద్యా విధానాన్ని తయారు చేశారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నో డిటెన్షన్ విధానాన్ని తీసుకురావడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయన్నారు. కార్యక్రమంలో ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement