అధికార జులుం.. | news about govt jobs | Sakshi
Sakshi News home page

అధికార జులుం..

Published Thu, Nov 17 2016 1:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

అధికార జులుం.. - Sakshi

అధికార జులుం..

►  ఏఆర్‌టీ ఉద్యోగాలపై టీడీపీ నేతల కన్ను            
  తాము చెప్పినవారినే నియమించాలని ఒత్తిళ్లు
ఇప్పటికే వాటిపై డబ్బు వసూలు చేసినట్టు ప్రచారం    
ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుకు సన్నద్ధమవుతున్న ఆస్పత్రి సూపరింటెండెంట్

 
ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగం వచ్చినా... అది ఆ పార్టీ నేతలు చెప్పినవారికే ఇవ్వాలన్న నిబంధన పెట్టుకున్నట్టుంది. ఇక్కడ నైపుణ్యానికి... పరీక్షలకు సంబంధం లేకుండా కేవలం సిఫార్సులతోనే తమకు నచ్చినవారిని ఎంపిక చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఏఆర్‌టీ సెంటర్‌కోసం మంజూరైన పోస్టులు తాము చెప్పినవారికే ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నారుు. ఈ పోస్టుల పేరుతో ఇప్పటికే వసూళ్లు చేసేశారన్న ప్రచారం ఊపందుకుంది.
 
పార్వతీపురం: ఏరియా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌కు నాలుగు పోస్టులు మంజూరయ్యారుు. వాటిలో మూడు తాను చెప్పినవారికే ఇవ్వాలని ఓ టీడీపీ నేత పట్టుపడుతున్నారు. అంతేగాదు.. ఆ పోస్టులు ఇప్పిస్తామంటూ లక్షలాదిరూపాయలు మరో నేత వసూలు చేసినట్టు విసృ్తత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను తమవారితో భర్తీ చేరుుంచుకున్న నేతలు ఇప్పుడు ఈ ఉద్యోగాలూ తాము చెప్పినవారికే ఇవ్వాలంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం.

అధికార పార్టీ నేల బెదిరింపులే కారణం..
ఆస్పత్రి సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లిపోతాననేందుకు ప్రధాన కారణం ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇంటికి పిలిచి రెక్రూట్ చేయాల్సిన 4 పోస్టుల్లో తనకు 3 పోస్టులు ఇవ్వాలన్నారు. దీంతో విసుగెత్తిన ఆయన తాను సెలవుపై వెళ్తానని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరో అధికార పార్టీ నేత ఇవే ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు పెద్ద దెబ్బ తగిలినట్లే.

ఈ నెల 1 ఉద్యోగాలకు ప్రకటన జారీ..
ఏరియా ఆస్పత్రి ఏఆర్‌టీ సెంటర్‌కు కావల్సిన ల్యాబ్ టెక్నిషీయన్, డేటా మేనేజర్, కేర్- కో ఆర్డినేటర్ తదితర ఉద్యోగాలను ఏపీ సాక్స్ మంజూరు చేయగా దీని కోసం ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టుల నియామకాల కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌ఓ, ఏరియా ఆస్పత్రి ఫిజీయన్‌లు సభ్యులుగా కమిటీని కూడా ఏర్పాటైంది. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దరఖాస్తులకు గడువు కూడా 11 నాటికి ముగింది.

రెండంకెల సంఖ్యలో దరఖాస్తులు..
నోటిఫికేషన్ రాగానే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 73, ఫార్మసిస్టు పోస్టులకు 35, డేటా మేనేజర్ పోస్టుకు 56, కేర్-కో ఆర్డినేటర్ ఉద్యోగానికి 12 దరఖాస్తులు వచ్చారుు. మొత్తం 176 దరఖాస్తులు రాగా వివిధ కారణాలతో 34 ఆప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యారుు. మొత్తం 142 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 21న పరీక్షను నిర్వహించి, తర్వాత మౌఖిక పరీక్ష పెట్టి, మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు.

ఉన్నతాధికారులు కల్పించుకోవాలి...
పేదలకు, గిరిజనులకు కార్పొరేట్ స్థారుులో సేవలందిస్తున్న ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది నియామకం విషయంలో జరుగుతున్న చర్యలపై ఉన్నతాధికారులు కల్పించుకుని ఆపాలి  - దరఖాస్తులు చేసుకున్న పలువురు అభ్యర్థులు
 
మెరిట్‌కే ప్రాధాన్యత..
ఏఆర్‌టీ సెంటర్‌లో ఉద్యోగాలకు సంబంధించి దళారులను నమ్మొదు. ఎంపికలు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ద్వారా పారదర్శకంగా జరుగుతారుు. మెరిట్‌కే ప్రాధాన్యత ఉంటుంది. - జి.నాగభూషణరావు,   ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement