jobs announcement
-
ఏప్రిల్‌లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
సవాళ్లున్నా మున్ముందుకే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉద్ఘాటించారు. అడ్డంకులను అధిగమించాం.. ‘‘అంతర్జాతీయంగా పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న మాట ముమ్మాటికీ వాస్తవం. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. శతాబ్దానికి ఒకసారి కనిపించే కోవిడ్–19 లాంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. ఈ విషయం ఎవరూ ఆలోచించడం లేదు. కరోనా వైరస్ ప్రపంచమంతటా ప్రతికూల ప్రభావం చూపింది. అయినప్పటికీ ఇలాంటి సమస్యల నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. రిస్క్‌లు తీసుకున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ప్రభుత్వ విభాగాల పనితీరు, సామర్థ్యం ఎంతగానో మెరుగుపడింది. ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా.. డ్రోన్ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని మోదీ పేర్కొన్నారు. -
ఇది కొలువుల కుంభమేళా
సాక్షి, హైదరాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ సీఎం చేయని విధంగా జిల్లాలు, జోన్లు, శాఖల వారీగా 91 వేల పోస్టుల భర్తీ చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఇది కొలువుల జాతర అని పత్రికలు రాశాయి. వాస్తవానికి ఇది కొలువుల కుంభమేళా..’’అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని.. ఈ 91 వేల కొలువులు భర్తీ చేస్తే మొత్తం 2.23 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం‘టీఎస్–ఐపాస్’కింద 19,145 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా.. ప్రైవేటు రంగంలో 16.43 లక్షల పైచిలుకు ఉద్యోగాలు వచ్చా యని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖల పద్దులపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. నిరుద్యోగుల కోసం ప్రతి నియోజకవర్గం లో ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఇందుకు కావాల్సిన ఇన్స్ట్రక్టర్లను సమకూరుస్తామని చెప్పారు. టీ–శాట్ చానళ్ల ద్వారా పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తామని ప్రకటించారు. కొలువులపై సీఎం ప్రకటనను నమ్మబోమని రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిపక్షాల నాయకులు అంటున్నారని.. నమ్మేవాళ్లు కొలువుల కోసం దరఖాస్తు చేసుకోవాలని, నమ్మనివాళ్లు ప్రధాని మోదీ హామీ ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా.. కేంద్రం చాలా అంశాల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘నిమ్జ్ హోదా లభించడంతో జహీరాబాద్ పారిశ్రామికవాడ, హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్రం నుంచి రూ.వేల కోట్లు వస్తాయనుకున్నాం. కానీ గత ఆరేళ్లలో జహీరాబాద్‌కు రూ.3 కోట్లు, ఫార్మాసిటీకి ఐదేళ్లలో రూ.5 కోట్లను మాత్రమే మోదీ ప్రభుత్వం ఇచ్చింది. ఇంత కంటే సిగ్గుచేటు ఉంటుందా? కోవిడ్ సంక్షోభంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైంది? ఒక్కరైనా లాభపడ్డారా? కేంద్రానికి అయితే జుమ్లా లేకుంటే హమ్లా (అయితే అబద్ధం.. లేకుంటే దాడి) చేయడమే వచ్చు. అచ్చే దిన్ అన్నరు. పరిశ్రమలకు సచ్చేదిన్ వచ్చాయి’’అని మండిపడ్డారు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–నాందేడ్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని కోరితే.. కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను హైదరాబాద్‌లో పెట్టాలని కోరితే.. యూపీ ఎన్నికల కోసమని ఏ సదుపాయాలూ లేని బుందేల్‌ఖండ్‌లో పెట్టారని మండిపడ్డారు. కేటీఆర్ వర్సెస్ భట్టి గురువారం శాసనసభలో మంత్రి కేటీఆర్‌కు, కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్కకు మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మొదట మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..‘‘బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అధ్యక్షుడి కంటే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువ బాధపడుతుండు. ఇద్దరూ అవిభక్త కవలల్లా తయారయ్యారని బయట మాట్లాడుతున్నరు. హుజూరాబాద్, కరీంనగర్ ఎన్నికల్లో వారు కుమ్మక్కయ్యారు’’అని ఆరోపించగా.. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. అయినా తగ్గని కేటీఆర్.. ‘‘కాంగ్రెస్ పార్టీలో మంచివాడైన భట్టిది నడుస్తలేదు. అక్కడ గట్టి అక్రమార్కులున్నరు. వారిదే నడుస్తోంది’’అని వ్యాఖ్యానించారు. అయితే సస్పెండ్ చేసిన ప్రక్రియ సరిగా లేదని మాత్రమే తమ పార్టీ అధ్యక్షుడు విమర్శించారని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని భట్టి డిమాండ్ చేశారు. దీంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కల్పించుకుంటూ.. ‘‘సీఎం పుట్టినరోజున పిండాలు పెట్టాలంటూ మాట్లాడిన వ్యక్తి గురించా మీరు మాట్లాడేది? ఆయనకు సంస్కారం ఉందా? అలాంటి అధ్యక్షుడిని కలిగి ఉండటం దురదృష్టకరం’’అని రేవంత్‌ను ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో కేటీఆర్ కూడా స్పందిస్తూ.. ‘‘రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని నేనేమైనా అడిగానా? అంటూ అస్సాం బీజేపీ సీఎం దారుణంగా చిల్లర మాటలు మాట్లాడిండు. అస్సాం సీఎం తప్పుడు మాటలు మాట్లాడిండు, క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేసిన సంస్కారవంతమైన నాయకుడు మా ముఖ్యమంత్రి. అలాంటి మా ముఖ్యమంత్రి బర్త్‌డేను మేమేదో చేసుకుంటే.. సంతాప దినాలు చేసుకోవాలని ఇక్కడి కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతడా? ఇదా సంస్కారం?’’అని మండిపడ్డారు. జీనోమ్ వ్యాలీని విస్తరిస్తాం రాష్ట్రంలో జీనోమ్ వ్యాలీని మరో 200–250 ఎకరాల్లో విస్తరించనున్నామని, మరో 200 బయోటెక్ కంపెనీలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. రైతుబీమా తరహాలో లక్ష మంది చేనేత కార్మికులకు చేనేత బీమా ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ప్రైవేటు రంగంలో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే విధానం తెస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావని పేర్కొన్నారు. అయితే స్థానికులకు అవకాశమిచ్చే పరిశ్రమలకు అదనపు రాయితీలు ఇస్తున్నామని వివరించారు. మామిడిపల్లిలో హార్డ్‌వేర్ పార్క్, మలక్‌పేటలోని ఆర్‌అండ్‌బీశాఖకు చెందిన 10 ఎకరాల స్థలంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
రైల్వేలో మరో 20వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుతుందన్నారు. ‘రైల్వేశాఖ దేశంలోని యువత కోసం 1.10 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన భర్తీ ప్రక్రియ మరింత విస్తృతమయింది’ అని గోయల్ ట్వీట్‌చేశారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల్లో రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్ఎఫ్)కు సంబంధించి 9 వేల పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ ఉద్యోగాల భర్తీకి ఈఏడాది మేలో నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. रेलवे में 90,000 के स्थान पर 1,10,000 जॉब के अवसरः RPF एवं RPSF में 9,000 तथा L1 व L2 में 10,000 से अधिक पदों के लिये भर्ती होंगी। 1,10,000 jobs in Railways for youth: One of the world's biggest recruitment drive gets even bigger. Get more information at https://t.co/OiflV87xxt pic.twitter.com/OLK32ls6ko — Piyush Goyal (@PiyushGoyal) March 29, 2018 -
రైల్వేలో 10 లక్షల ఉద్యోగాలు
ముంబై: వచ్చే ఐదేళ్లలో దేశంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 150 బిలియన్ డాలర్లు(రూ. 9.75 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. ‘వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వే శాఖలోనే 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఆ మొత్తాన్ని ఉద్యోగాల రూపంలో చెప్పాలంటే... ఈ పెట్టుబడుల ద్వారా 10 లక్షల కొత్త ఉద్యోగాల్ని కల్పించవచ్చు’ అని వెల్లడించారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు శ్రీకారం చుట్టారు. రైల్వేకు రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమన్న ఆయన అందుకోసం విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానించారు. ఆ సమయంలోనే రైల్వేలో వివిధ ప్రాజెక్టుల కోసం 1.5 లక్షల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ముందుకొచ్చింది. ప్రస్తుతం గోయల్ ప్రకటించిన 150 బిలియన్ డాలర్లు పెట్టుబడులు సురేష్ ప్రభు రూపొందించిన ప్రణాళికకు సంబంధించినవేనా? అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ నెల ప్రారంభంలోనే గోయల్ మాట్లాడుతూ వచ్చే 12 నెలల్లో రైల్వేలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గమనార్హం. నాలుగేళ్లలోనే విద్యుదీకరణ పూర్తి ప్రయాణికులకు సురక్షిత, సుఖవంతమైన ప్రయాణం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించే సత్తా రైల్వే శాఖకు ఉందని గోయల్ చెప్పారు. దేశమంతా రైల్వే లైన్ల విద్యుదీకరణను గతంలో నిర్దేశించిన పదేళ్లలో కాకుండా నాలుగేళ్లలోనే పూర్తి చేస్తామని, దీనివల్ల రైల్వేకు 30 శాతం మేర ఖర్చులు ఆదా అవుతాయని ఆయన వెల్లడించారు. దేశమంతా విద్యుదీకరణ వల్ల ఇంధన ఖర్చుల రూపంలో రైల్వేకు ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఆదా అవుతాయని గోయల్ తెలిపారు. -
ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల పరిథిలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.వాణిజ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్ల్సోజివ్స్ పోస్టులు, వినియోగదారులు, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలో సైంటిఫిక్ ఆఫీసర్ల పోస్టులు, డిఫెన్స్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టులు, కార్మిక ఉపాథి మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ (సేఫ్టీ, ఎలక్ట్రికల్), డిప్యూటీ డైరెక్టర్ (మెకానికల్), కార్మిక ఉపాథి కల్పన మంత్రిత్వ శాఖలో సబ్ రీజినల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, గనుల శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్ 2లోగా ఆన్లైన్ రిక్రూట్మెంట్ దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ పేర్కొంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు యూపీఎస్సీఆన్లైన్.ఎన్ఐసీ.ఇన్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. -
అధికార జులుం..
► ఏఆర్టీ ఉద్యోగాలపై టీడీపీ నేతల కన్ను ► తాము చెప్పినవారినే నియమించాలని ఒత్తిళ్లు ► ఇప్పటికే వాటిపై డబ్బు వసూలు చేసినట్టు ప్రచారం ► ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుకు సన్నద్ధమవుతున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ ఈ ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగం వచ్చినా... అది ఆ పార్టీ నేతలు చెప్పినవారికే ఇవ్వాలన్న నిబంధన పెట్టుకున్నట్టుంది. ఇక్కడ నైపుణ్యానికి... పరీక్షలకు సంబంధం లేకుండా కేవలం సిఫార్సులతోనే తమకు నచ్చినవారిని ఎంపిక చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఏఆర్టీ సెంటర్‌కోసం మంజూరైన పోస్టులు తాము చెప్పినవారికే ఇవ్వాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నారుు. ఈ పోస్టుల పేరుతో ఇప్పటికే వసూళ్లు చేసేశారన్న ప్రచారం ఊపందుకుంది. పార్వతీపురం: ఏరియా ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్‌కు నాలుగు పోస్టులు మంజూరయ్యారుు. వాటిలో మూడు తాను చెప్పినవారికే ఇవ్వాలని ఓ టీడీపీ నేత పట్టుపడుతున్నారు. అంతేగాదు.. ఆ పోస్టులు ఇప్పిస్తామంటూ లక్షలాదిరూపాయలు మరో నేత వసూలు చేసినట్టు విసృ్తత ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను తమవారితో భర్తీ చేరుుంచుకున్న నేతలు ఇప్పుడు ఈ ఉద్యోగాలూ తాము చెప్పినవారికే ఇవ్వాలంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. అధికార పార్టీ నేల బెదిరింపులే కారణం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లిపోతాననేందుకు ప్రధాన కారణం ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇంటికి పిలిచి రెక్రూట్ చేయాల్సిన 4 పోస్టుల్లో తనకు 3 పోస్టులు ఇవ్వాలన్నారు. దీంతో విసుగెత్తిన ఆయన తాను సెలవుపై వెళ్తానని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌కు చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరో అధికార పార్టీ నేత ఇవే ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు పెద్ద దెబ్బ తగిలినట్లే. ఈ నెల 1 ఉద్యోగాలకు ప్రకటన జారీ.. ఏరియా ఆస్పత్రి ఏఆర్టీ సెంటర్‌కు కావల్సిన ల్యాబ్ టెక్నిషీయన్, డేటా మేనేజర్, కేర్- కో ఆర్డినేటర్ తదితర ఉద్యోగాలను ఏపీ సాక్స్ మంజూరు చేయగా దీని కోసం ఈ నెల 1న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టుల నియామకాల కోసం ఆస్పత్రి సూపరింటెండెంట్, అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ, ఏరియా ఆస్పత్రి ఫిజీయన్లు సభ్యులుగా కమిటీని కూడా ఏర్పాటైంది. రాత, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. దరఖాస్తులకు గడువు కూడా 11 నాటికి ముగింది. రెండంకెల సంఖ్యలో దరఖాస్తులు.. నోటిఫికేషన్ రాగానే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 73, ఫార్మసిస్టు పోస్టులకు 35, డేటా మేనేజర్ పోస్టుకు 56, కేర్-కో ఆర్డినేటర్ ఉద్యోగానికి 12 దరఖాస్తులు వచ్చారుు. మొత్తం 176 దరఖాస్తులు రాగా వివిధ కారణాలతో 34 ఆప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యారుు. మొత్తం 142 మంది పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 21న పరీక్షను నిర్వహించి, తర్వాత మౌఖిక పరీక్ష పెట్టి, మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. ఉన్నతాధికారులు కల్పించుకోవాలి... పేదలకు, గిరిజనులకు కార్పొరేట్ స్థారుులో సేవలందిస్తున్న ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది నియామకం విషయంలో జరుగుతున్న చర్యలపై ఉన్నతాధికారులు కల్పించుకుని ఆపాలి - దరఖాస్తులు చేసుకున్న పలువురు అభ్యర్థులు మెరిట్‌కే ప్రాధాన్యత.. ఏఆర్టీ సెంటర్లో ఉద్యోగాలకు సంబంధించి దళారులను నమ్మొదు. ఎంపికలు రాత పరీక్ష, మౌఖిక పరీక్ష ద్వారా పారదర్శకంగా జరుగుతారుు. మెరిట్‌కే ప్రాధాన్యత ఉంటుంది. - జి.నాగభూషణరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్.