సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగార్థులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల పరిథిలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నోటిఫికేషన్ జారీ చేసింది.వాణిజ్య మంత్రిత్వ శాఖలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్ల్సోజివ్స్ పోస్టులు, వినియోగదారులు, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలో సైంటిఫిక్ ఆఫీసర్ల పోస్టులు, డిఫెన్స్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టులు, కార్మిక ఉపాథి మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ (సేఫ్టీ, ఎలక్ట్రికల్), డిప్యూటీ డైరెక్టర్ (మెకానికల్), కార్మిక ఉపాథి కల్పన మంత్రిత్వ శాఖలో సబ్ రీజినల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, గనుల శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
నవంబర్ 2లోగా ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్‌సీ పేర్కొంది. ఆసక్తికలిగిన అభ్యర్థులు యూపీఎస్‌సీఆన్‌లైన్.ఎన్‌ఐసీ.ఇన్‌లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment