న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుతుందన్నారు. ‘రైల్వేశాఖ దేశంలోని యువత కోసం 1.10 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన భర్తీ ప్రక్రియ మరింత విస్తృతమయింది’ అని గోయల్ ట్వీట్‌చేశారు. కొత్తగా ప్రకటించిన ఉద్యోగాల్లో రైల్వే పోలీస్ ఫోర్స్(ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్పీఎస్‌ఎఫ్)కు సంబంధించి 9 వేల పోస్టులు ఉన్నట్లు తెలిపారు. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్‌ఎఫ్ ఉద్యోగాల భర్తీకి ఈఏడాది మేలో నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు.
रेलवे में 90,000 के स्थान पर 1,10,000 जॉब के अवसरः RPF एवं RPSF में 9,000 तथा L1 व L2 में 10,000 से अधिक पदों के लिये भर्ती होंगी।
— Piyush Goyal (@PiyushGoyal) March 29, 2018
1,10,000 jobs in Railways for youth: One of the world's biggest recruitment drive gets even bigger. Get more information at https://t.co/OiflV87xxt pic.twitter.com/OLK32ls6ko
Comments
Please login to add a commentAdd a comment