కనెక్షన్ల మంజూరులో జాప్యం వద్దు
కనెక్షన్ల మంజూరులో జాప్యం వద్దు
Published Fri, Sep 9 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
కర్నూలు(రాజ్‌విహార్): వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో జాప్యం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్‌ఈ జి. భార్గవ రాముడు హెచ్చరించారు. కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ భవన్‌లో శుక్రవారం ఎన్‌టీఆర్ జలసిరి పథకంపై సమీక్ష నిర్వహించారు. 971 దరఖాస్తులకుగాను 931 కనెక్షన్లకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు డబ్బు చెల్లినట్లు చెప్పారు. ఇందులో 776 మందికి కనెక్షన్లు ఇచ్చామని, మిగతా వారికి సర్వీసులు మంజూరు చేసినా సరఫరా అందించాల్సి ఉందని ఎస్‌ఈ తెలిపారు. ఆదోని డివిజన్‌లో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, డోన్ డివిజన్‌లో డోన్ సబ్ డివిజన్, నంద్యాల డివిజన్‌లోని ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల సబ్‌డివిజన్లలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉందని, వీటిని ఈనెల 30వ తేదీలోగా మంజూరు చేయాలని ఆదేశించారు. సాధారణంగా ఏడీఈ వారంలో ఒక రోజు మాత్రమే సామగ్రి (మెటీరియల్) డ్రా చేసుకునే వీలుందని, ఎన్‌టీఆర్ జలసిరి కనెక్షన్లకు సంబంధించి ఎప్పుడైనా డ్రా చేసుకునే వీలు కల్పించామన్నారు. డ్వామా పీడీ పుల్లారెడ్డి, టెక్నికల్ డీఈఈ మహమ్మద్ సాధిక్, కర్నూలు డీఈ రమేష్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Advertisement