విద్యారంగ అభివృద్ధికి చంద్రబాబు చేసింది శూన్యం
Published Fri, Aug 5 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
నిడదవోలు : రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీలేదని, విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ రావుసూర్యారావు విమర్శించారు. నిడదవోలు మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆదర్శ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం 23 వేల కోట్ల నిధులను మంజూరు చేస్తామని ఇచ్చిన హామిని చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ మునిసిపల్ ఉపాధ్యాయులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. కంట్రిబ్యూటరీ పింఛన్ స్కీంను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నవంబర్ 29న ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సమయంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టి ఉద్యమిస్తామన్నారు. చలో పార్లమెంట్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల మంది యూటీఎఫ్ నాయకులు, జిల్లా నుండి 300 మంది నాయకులు తరలివెళ్లనున్నట్టు చెప్పారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంతి సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement