సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లోని ఆసుపత్రుల్లో నర్సుల ఉద్యోగాల నియామకానికి ఆసక్తిగల వారు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సౌదీలో నర్సు ఉద్యోగాలు
Jul 6 2017 10:57 PM | Updated on Aug 20 2018 7:33 PM
కర్నూలు(హాస్పిటల్): సౌదీ అరేబియా, కువైట్ దేశాల్లోని ఆసుపత్రుల్లో నర్సుల ఉద్యోగాల నియామకానికి ఆసక్తిగల వారు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి ప్రతాపరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓవర్సీస్ మాస్ పవర్ కంపెనీ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నర్సింగ్‌లో డిగ్రీ కలిగి హెచ్‌డీ డయాలసిస్‌లో కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలని, ప్రస్తుతం పనిచేస్తూ ఉండాలని సూచించారు. ఇంగ్లిష్ భాషలో మాట్లాడి అర్థం చేసుకునే ప్రావీణ్యం ఉండాలని, పాస్‌పోర్ట్ తప్పక కలిగి ఉండాలని తెలిపారు. అర్హులైన వారికి జులై 2వ వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు రూ.50వేలకు పైగా జీతం ఉంటుందని తెలిపారు. వివరాలకు 0877–2248231, 0866–2484948, 8886882038 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Advertisement
Advertisement