కర్నూలు (కల్చరల్) : ప్రస్తుత తరం విద్యార్థులు సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్‌రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తెలుగు కళాస్రవంతి ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ప్రముఖ సముద్రశాస్త్రవేత్త ఎంపీఎం రెడ్డి..కర్నూలు జిల్లాలో పుట్టి ప్రపంచంలోని సముద్రాలన్నింటినీ చుట్టి వచ్చారన్నారు. భారతదేశపు తొలి సముద్రపు శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన ఆయన బాలల కోసం సముద్రశాస్త్ర పుస్తకాలు రచించడం అభినందనీయమన్నారు. సముద్ర శాస్త్రం 5వ భాగాన్ని ప్రముఖ కథారచయిత ఇనాయతుల్లా, ఆరో భాగాన్ని రిటైర్డు తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ గంగిరెడ్డి సమీక్షించారు. ప్రతిభ విద్యాసంస్థల గౌరవ సలహాదారు డాక్టర్ అరుణాచల్‌రెడ్డి, పుస్తక రచయిత డాక్టర్ ఎంపీఎం రెడ్డి, ప్రముఖ జనపద కవి డాక్టర్ వి.పోతన, ఫ్రెండ్స్ బుక్‌డిపో అధినేత పుల్లారెడ్డి, డాక్టర్ అహ్మద్‌హుసేన్ తదితరులు పాల్గొన్నారు.