ఓడీఎఫ్ జిల్లాగా తూర్పు
Published Mon, Apr 24 2017 11:58 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
పెద్దాపురం :
స్వచ్ఛ భారత్‌లో భాగంగా రాష్ట్రంలోనే తూర్పుగోదావరిని ఓడిఎఫ్ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. పంచాయతీరాజ్ మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ స్థాయి ఓడిఎఫ్ గ్రామాల సమీక్షా సమావేశం సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు అ«ధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి రాజప్ప మాట్లాడుతూ జిల్లా అంతటా ఓడీఎఫ్ ప్రకటించడం జరిగిందని, సంపూర్ణ బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అన్ని పట్టణ, గ్రామాల్లో నూరు శాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు పూర్తి చేసే దిశగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ శాఖలో సర్పంచ్‌లదే కీలకపాత్రని, గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ నియోజకవర్గంలో నూరుశాతం ఐఎస్‌ఎల్ నిర్మాణాలు జరగాలని, వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. దీనికి ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖాధికారులు సత్వర చొరవ చూపాలన్నారు. పెద్దాపురం, సామర్లకోట జెడ్పీటీసీలు సుందరపల్లి శివనాగరాజు, గుమ్మల విజయలక్ష్మి, సామర్లకోట ఎంపీపీ గొడత మార్త, ఏఎంసీ వైస్ చైర్మ¯ŒS ఎలిశెట్టి నాని. సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షులు కొత్తెం కోటిలు మాట్లాడుతూ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గం ఆదర్శం కావాలంటే ప్రతి సర్పంచ్ ఐఎస్‌ఎల్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం సామర్లకోట, పెద్దాపురం ఓడిఎఫ్ గ్రామాల సర్పంచ్‌లను మంత్రి రాజప్ప చేతుల మీదుగా సత్కరించారు. ఎంపీడీవోలు పల్లాబత్తుల వసంతమాధవి, బి.నాగేశ్వరరావు, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement