అతడికి 55..ఆమెకు 13 ఏళ్లు | Officers stops child marriage in medak | Sakshi

అతడికి 55..ఆమెకు 13 ఏళ్లు

Feb 23 2017 9:33 PM | Updated on Sep 5 2017 4:26 AM

అతడికి 55..ఆమెకు 13 ఏళ్లు

అతడికి 55..ఆమెకు 13 ఏళ్లు

పెళ్లయి ఇద్దరు కుమార్తెలున్న ఓ వ్యక్తి బాలికతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

నర్సాపూర్‌ రూరల్‌(మెదక్‌):
పెళ్లయి ఇద్దరు కుమార్తెలున్న ఓ వ్యక్తి బాలికతో మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. అధికారుల జోక్యంతో ఆ తంతుకు తెరపడింది. వివరాలివీ.. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం ఎల్లాపూర్‌ గ్రామానికి చెందిన సంచార జాతికి చెందిన బాలిక(13)కు పెద్దచింతకుంటకు చెందిన ఓ వ్యక్తి(55)తో పెళ్లి చేసేందుకు రెండు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. పెళ్లి ఈ నెల 25వ తేదీన జరగాల్సి ఉంది. అయితే, కొందరు వ్యక్తులు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి ఈ సమాచారం చేరవేశారు.

దీంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి రామకృష్ణ, సాధన స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్‌ యాదగిరి, చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ వెంకటేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ తారాబాయి, పోలీసుల సహకారంతో ఎల్లాపూర్‌కు వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ చేశారు. పెళ్లి జరుగకుండా వారితో ఒప్పంద పత్రాన్ని రాయించుకున్నారు. మరో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు కావాలన్న కోరికతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని అధికారులు తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రెండు కుటుంబాల వారిపై కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్‌ పోలీసులు వారిని హెచ్చరించి వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement