నల్లగొండ టూటౌన్: ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26న∙రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ చేపడుతున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిఖిత తెలిపారు. గురువారం ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. 22న సీఎం శవయాత్రలు, 25న రాస్తారోకోలు, 26న బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారాన్ని అరికట్టి పెంచిన ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఫీజులను పూర్తిస్థాయిలో ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం విద్యా సంస్థల బంద్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నీరటి రమేష్, కో – కన్వీనర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
26న విద్యా సంస్థల బంద్
Published Thu, Jul 21 2016 11:59 PM | Last Updated on Thu, Jul 11 2019 5:31 PM
Advertisement