రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
Published Tue, Jan 17 2017 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఓర్వకల్లు : కర్నూలు–చిత్తూరు 18వ జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరువెళ్ల మండలం రాజనగరం గ్రామానికి చెందిన శేషుబాబు(37) హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలో నన్నూరు సమీపాన గల నారాయణ బాలికల జూనియర్ కళాశాల ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేషుబాబు తలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కోలుకోలేక సాయంత్రం మృతి చెందినట్లు వైద్యుల నుంచి సమాచారం వచ్చింది. ఆ మేరకు ఓర్వకల్లు పోలీసులు ఆసుపత్రికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని.. ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.
Advertisement
Advertisement