రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీఎస్ఎల్ వైద్య కళాశాలలో పనిచేసే కె.సత్యనారాయణ (55) విధులు ముగిసిన తర్వాత సైకిల్‌పై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జీఎస్ఎల్ వైద్య కళాశాల ముందే చోటు చేసుకుంది.