కారు ఢీకొని స్కూటరిస్ట్‌ దుర్మరణం | one dies of car and bike accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని స్కూటరిస్ట్‌ దుర్మరణం

Published Sun, Apr 9 2017 11:03 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

one dies of car and bike accident

పామిడి (గుంతకల్లు) : జాతీయ రహదారిలోని పామిడి సమీపాన గల ఖల్సా డాబా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు, స్కూటర్‌ ఢీ కొన్నాయి. ప్రమాదంలో పామిడికి చెందిన చిన్నాజీరావు(76) మృతి చెందగా, శంకరయ్య(65) తీవ్రంగా గాయపడ్డారని పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నాగేంద్ర తెలిపారు. ఆయన కథనం ప్రకారం... పొలం చూసేందుకు పైన పేర్కొన్న ఇద్దరూ స్కూటర్‌లో బయలుదేరారు.

మార్గమధ్యంలో డాబా వద్దకు రాగానే వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో శంకరయ్య తలకు తీవ్ర గాయాలు కాగా, చిన్నాజీరావు కాళ్లు, చేతులు విరిగాయి. శంకరయ్యను బెంగళూరుకు, చిన్నాజీరావును అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నాజీరావు మృతి చెందారు. శంకరయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement