మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం కడుకుంట్ల స్టేజీ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం వేకువజామున జాతీయ రహదారిపై రెండు డీసీఎంలు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒక డీసీఎం క్లీనర్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన చంద్రశేఖర్(30) చనిపోయాడు. గాయపడిన మరో ఇద్దరిని 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.