వేములవాడలో లక్ష దీపోత్సవం | one lakh lamps celebrations in vemulavada rajanna temple | Sakshi
Sakshi News home page

వేములవాడలో లక్ష దీపోత్సవం

Published Fri, Nov 25 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM

వేములవాడలో లక్ష దీపోత్సవం

వేములవాడలో లక్ష దీపోత్సవం

వేములవాడ : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో గురువారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహిం చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ధర్మప్రచార యాత్రలో భాగంగా బళ్లారి పంపా సంస్థాన్ భగవాన్ గోవిందానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు.

ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించిన అనంతరం లక్ష దీపాలను వెలిగించారు. ముందుగా గోవిందానంద సరస్వతి స్వామీజీ దీపాలు వెలిగించిన అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆ తర్వాత ఆలయ ఆవరణలో మహిళలంతా దీపాలు వెలి గించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement