హిట్లర్‌ను తలపిస్తున్న కేసీఆర్ పాలన
∙రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్
∙లాఠీచార్జి్జపై నిరసన
∙ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నర్సంపేట: ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి, రాజ్యాంగం కల్పించిన హామీ లను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వం హిట్లర్ నియంతనపాలనను తలపిస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద పోలీ సుల లాఠీచార్జి, దమనకాండలను నిరసిస్తూ నర్సంపేటలో ప్రభుత్వ దిష్టిబొ మ్మను సీపీఎం నాయకులు దహనం చేశారు. రమేష్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటకుండా, అడిగే హక్కు లేకుండా చేయాలని చూడడం అప్రజాస్వామికమన్నారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను కొనసాగించాలని ఆయన డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వం గాల రాఘసుధ, సీపీఎం పట్టణ నాయకులు వెంకన్న, రవి, శోభ, రాజు, రమేష్, రాములు, కార్తీక్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో..
ధర్నాచౌక్‌ను ప్రభుత్వం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారి పై ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించడం అప్రజాస్వామికమని ఎన్డీ జిల్లా కమిటీ సభ్యుడు లావుడ్య రాజు అన్నారు. లాఠీచార్జి్జకి వ్యతిరేకంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. పార్టీ డివిజన్ నాయకులు చెల్లమల్ల నర్సన్న, మాడ అశోక్ పాల్గొన్నారు.