కన్నుల పండువగా పాల పొంగుల షష్ఠి
పావగడ : స్థానిక నాగలమడక శ్రీ అంత్య సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన పాల పొంగుల షష్ఠి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు బదరీనాథ్ ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ముజరాయి అధికారి తహశీల్దార్ తిప్పూరావు ప్రత్యేక పూజలు చేశారు.
అయితే ఈ సారైనా విస్తర్లు మోసి మొక్కులు తీర్చుకుందామని షష్ఠికి తరలివచ్చిన వేలాది మంది భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. కేవలం దేవుడిని దర్శించుకుని పూజలతో సరిపెట్టుకున్నారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వేద మంత్రాల మధ్య భోజన మంటపంలోని తరలించి అన్నం రాశిపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని బ్రాహ్మణులు ఆరగించారు.