pavagada
-
ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే
పావగడ (కర్ణాటక): స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరమణప్ప ఓ యువకున్ని చెంప దెబ్బ కొట్టడం దుమారం రేపింది. ఈ నెల 19 న ఎమ్మెల్యే తాలూకాఫీసులో ఓ సమావేశంలో పాల్గొని బయటికి వస్తుండగా నాగేనహళ్ళికి చెందిన నరేంద్ర అనే యువకుడు హుసేన్‌పురం, ర్యాపిట, నాగేనహళ్ళి గ్రామాలకు చెందిన రోడ్లను ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యే ని ప్రశ్నించాడు. మీ గ్రామాలకు రూ 3.50 కోట్లను మంజూరు చేశామని, వారం లోగా పనుల్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఆ యువకుడు... ఏ .... నా కొడుకూ విన్పించుకోడు అని కోపంగా అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆ యువుకున్ని చెంప దెబ్బ కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెంప దెబ్బ వీడియో వైరల్ అయ్యింది. In Karnataka, Venkataramanappa, Congress MLA from Pavagada, slaps a youth who asked for road in his village. After Siddaramaiah and DKS slapping Congress workers in public, this is a new low. Reminds us of Amethi, where Rahul asked a young man demanding road to join the BJP. pic.twitter.com/XhYeldhZII — Amit Malviya (@amitmalviya) April 21, 2022 ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తాలూకాపీసు ఎదుట బీజేపి నాయకులు గురువారం ఆందోళన చేశారు. రోడ్డు వేయాలని కోరితే దాడి చేస్తారా?, ప్రజలను రక్షించాల్సిన ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టడం అమానుషమన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: (ఘనంగా మంత్రి కుమారుడి వివాహం) -
ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి
కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్‌ఎస్ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని.. -
పావగడలో పోటెత్తిన భక్తులు
పావగడ: శ్రావణ మాసం సందర్భంగా స్థానిక శనీశ్వరాలయంలో తృతీయ శ్రావణ శనివారోత్సవం శనివారం అపురూపంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం కోసం ఏర్పాటు చేసిన 3 క్యూ లైన్లలో భక్తులు శుక్రవారం రాత్రి నుంచే బారులు తీరారు. ఉదయం 4 గంటలకే పూజలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సమీపంలోని శీతలాంబదేవి, కోటె ఆంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయస్వామి వారికి భక్తులు పూజలు చేశారు. దీక్షా మండపంలో భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా అన్నదానం చేశారు. -
వెన్నంటి ఉంటాడు... వెన్నలా కరుగుతాడు
సందర్భం : పావగడ ఆలయంలో శ్రావణ శనివారోత్సవాలు శాంతి స్వరూపుడైన శనీశ్వరుడు తనకు ఇష్టమొచ్చిన రీతిలో సంచరిస్తూ.. భక్తులు పెడదారి పట్టకుండా వెన్నంటే ఉంటాడని, పాపులను పట్టి పీడిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి. సకల దేవతలను సైతం గడగడలాడించిన శనీశ్వరుడు నిజమైన భక్తుల పాలిట వెన్నలా కరిగిపోతాడనే ప్రతీతి కూడా ఉంది. కష్టాలను తొలగించే స్వామిగా ఖ్యాతి గడించిన శనీశ్వరుడి ఉత్సవాలు పావగడలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. శ్రావణ శనివారోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. పావగడ: స్థానిక శనీశ్వరాలయంలో కొలువుతీరిన శనైశ్చర స్వామి శ్రావణ శనివారోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పావగడలో వెలసిన శనీశ్వరుడు శాంత స్వరూపుడని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణస్వామి అంటున్నారు. శ్రావణ మాసంలో స్వామి వారిని కొలిస్తే కష్టాలు తొలగి సుఖాలు ప్రాప్తిస్తాయని చెబుతున్నారు. ఏలినాటి శని తొలిగిపోవడానికి పావగడ శనీశ్వరుడినే కొలవాలని అంటున్నారు. ఆలయ చరిత్ర... పావగడ నడిబొడ్డున వెలసిన శనీశ్వరాలయం సుమారు 70 సంవత్సరాల క్రితం ఓ చిన్న గుడిలా ఉండేది. ఓ భక్తుడు శనీశ్వర స్వామి చిత్ర పటాన్ని ఇక్కడి చెట్టు కింద పెట్టి పూజించేవాడు. కాల క్రమేణా శనీశ్వర స్వామిని పూజించే భక్తుల సంఖ్య ఎక్కువైంది. దీంతో కొంత మంది ధర్మకర్తలతో కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం పూర్తి అయింది. అప్పట్లో పట్టణంలో కలరా వ్యాపించి పట్టణవాసులు మృత్యువాత పడుతుండేవారు. ఇలాంటి తరుణంలో శాంతి చేకూర్చే శీతల యంత్రాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అప్పట్నుంచి వర్షాలు బాగా కురిసి పంటలు పండి కరువు తీరింది. కలరా తొలగి పట్టణవాసులు క్షేమంగా ఉన్నారు. ఆలయంలో శీతలాంభ దేవిని ప్రతిష్టించారు. తదనంతరం శనీశ్వర స్వామిని ప్రతిష్టించినట్లు ఆలయ ధర్మ కర్తలు తెలిపారు. అంచెలంచెలుగా అభివృద్ధి ఓ వైపు లక్షలాది మంది భక్తుల కానుకలు, విరాళాలతో ఆలయం అభివృద్ధి చెందుతుంటే మరో వైపు ఎస్ఎస్కే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్కే సముదాయ భవనం, బయలు రంగ మందిరం, డార్మెటరీ భవనం, అన్నపూర్ణ దాసోహ భవన నిర్మాణాలతో భక్తులకు ఎనలేని సేవలందిస్తున్నారు. ప్రతి శుక్ర, శని, ఆది, సోమవారాల్లో భక్తులకు ఉచిత భోజన వసతి కల్పించారు. మరో అడుగు ముందుకేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. తుమకూరు రోడ్డులో డాక్టర్ పి.నారాయణప్ప ఉచితంగా అందించిన తొమ్మిది ఎకరాల స్థలంలో ఎస్ఎస్కే శాంతి పీయూ కళాశాలను నెలకొల్పారు. -
కన్నుల పండువగా శని జయంతి
పావగడ : సర్వపాపహరుడు, శాంత స్వరూపుడు శనీశ్వరస్వామి జయంతి వేడుకలు గురువారం కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శనీశ్వరాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజా మండపంలో శనీశ్వరస్వామి, జ్యేష్టాదేవిమూర్తులను అలంకరించారు. మూడు రోజుల నుంచి శని జయంతి వేడుకలను పురస్కరించుకుని వేద పండితులు యజ్ఞ యాగాదులు, హోమాలు నిర్వహించారు. చివరి రోజు గురువారం వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శీతలాంబదేవికి సైతం మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. -
తలనీలాల ఆదాయం రూ.73 లక్షలు
పావగడ : స్థానిక శ్రీ శనీశ్వరాలయం అన్నదాసోహ భవనంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలంలో రూ. 73 లక్షలు ఆదాయం లభించింది. హిందూపురానికి చెందిన వేలందారులు ఆనంద్, ఆదినారాయణ వేలంలో పాల్గొని, తలనీలాలను దక్కించుకున్నారు. అదేవిధంగా భక్తులు స్నానమాచరించిన తర్వాత వదిలేసిన పాత వస్త్రాలు వేలంలో రూ 5.45 లక్షలకు వేలందారులు దక్కించుకున్నారు. కొబ్బరి వేలాన్ని వాయిదా వేశారు. వేలంలో ఎస్ఎస్కే సంఘం అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి ఆనందరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
వైభవంగా బ్రహ్మ రథోత్సవం
పావగడ : కణివె శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రాలు , వింజామర సేవలతో అర్చకులు రథంలోకి తరలించి ప్రతిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారి , తహసీల్దార్ తిప్పూరావు రథాన్ని లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బ్రహ్మరథంలోకి అరటి పళ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పలువురు ధర్మకర్తలు భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. -
కమనీయం.. శనీశ్వరుడి కళ్యాణం
పావగడ : స్థానిక శనేశ్వరాలయంలో స్వామి, జ్యేష్ఠాదేవిల కళ్యాణోత్సవç³ం గురువారం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో శనీశ్వర స్వామి, జ్యేష్ఠాదేవి విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి ప్రతిష్ఠించారు. అనంతరం వేద పండితుల పెళ్లి మంత్రాలు, భజంత్రీల సన్నాయి మేళాల మధ్య స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామి వారు, దేవేరిపై అక్షింతలు చల్లి పూజలు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, ఆవాహిత దేవతారాధన, ధ్వజారోహణ, దీక్షాహోమం, బలిహరణ, సూర్యారాధన పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నిర్వహించిన మహా చండీ యాగం భక్తులను ఆకట్టుకుంది. -
శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పావగడ : స్థానిక శనైశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు స్వామి వారికి తైలాభిషేకం, గణపతి పూజది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆవాహిత దేవతారాధన, వేద పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వ సేవా పూజల్లో భాగంగా గదలు మోసి గర్భగుడి చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు శీతలాంభ దేవికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ తదితర డైరెక్టర్లు భక్తులకు సేవలందించారు. -
కన్నుల పండువగా పాల పొంగుల షష్ఠి
పావగడ : స్థానిక నాగలమడక శ్రీ అంత్య సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన పాల పొంగుల షష్ఠి ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు బదరీనాథ్ ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ముజరాయి అధికారి తహశీల్దార్ తిప్పూరావు ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఈ సారైనా విస్తర్లు మోసి మొక్కులు తీర్చుకుందామని షష్ఠికి తరలివచ్చిన వేలాది మంది భక్తుల ఆశలు అడియాసలయ్యాయి. కేవలం దేవుడిని దర్శించుకుని పూజలతో సరిపెట్టుకున్నారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలు వేద మంత్రాల మధ్య భోజన మంటపంలోని తరలించి అన్నం రాశిపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం అన్న ప్రసాదాన్ని బ్రాహ్మణులు ఆరగించారు. -
వివాహిత బలవన్మరణం
పావగడ: పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజవంతి గ్రామానికి చెందిన అనిత(19) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... రాజవంతికి చెందిన అనితకు ఆరు నెలల క్రితం శివకుమార్‌తో వివాహమైంది. మూడు రోజుల క్రితం ఊరిలోని ఓ బావిలో దూకింది. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె ఆత్మమత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ మంజునాథ్ కేసు నమోదు చేసుకున్నారు. -
‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో సీటుకోసం అభిమానుల మధ్య గొడవ
నెయిల్ కట్టర్‌తో దాడి... ఒకరి మృతి పావగడ (కర్ణాటక): తుమకూరు జిల్లా పావగడలో శుక్రవారం పవన్ కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం విడుదల సందర్భంగా జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన రాకేశ్(20), టీకొట్టు నిర్వాహకుడు రవి.. పవన్ అభిమానులు. వీరు మధ్యాహ్నం స్థానిక అలంకార్ థియేటర్లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని చూసేందుకు వెళ్లారు. కుర్చీ కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రవి నెయిల్ కట్టర్‌కు ఉండే చిన్నపాటి చాకుతో రాకేశ్ మెడపై పొడిచాడు. ప్రధాన నరం తెగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. నిందితుడు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్య నేపథ్యంలో థియేటర్లో చిత్ర ప్రదర్శనను నిలిపేశారు.