శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం | saneswara swamy brahmothsavas | Sakshi
Sakshi News home page

శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Published Wed, Feb 8 2017 9:51 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శనైశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

పావగడ : స్థానిక శనైశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు స్వామి వారికి తైలాభిషేకం, గణపతి పూజది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సాయంత్రం ఆవాహిత దేవతారాధన, వేద పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సర్వ సేవా పూజల్లో భాగంగా గదలు మోసి గర్భగుడి చుట్టూ ప్రదక్షణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు శీతలాంభ దేవికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపాల్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితర డైరెక్టర్లు భక్తులకు సేవలందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement