యాదాద్రిలో పొటేత్తిన భక్తులు
సాక్షి, యాదగిరి కొండ : యాదాద్రి పుణ్యక్షేత్రంలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెలవుదినం కావడంతో భక్తులు యాదాద్రిశ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకోవడానికి పోటెత్తారు.
దీంతో యాదాద్రి పరిసరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది. రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment