పావగడ : స్థానిక శనేశ్వరాలయంలో స్వామి, జ్యేష్ఠాదేవిల కళ్యాణోత్సవç³ం గురువారం కమనీయంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల పందిరిలో శనీశ్వర స్వామి, జ్యేష్ఠాదేవి విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి ప్రతిష్ఠించారు. అనంతరం వేద పండితుల పెళ్లి మంత్రాలు, భజంత్రీల సన్నాయి మేళాల మధ్య స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండువలా నిర్వహించారు.
ఈ వేడుకలో భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామి వారు, దేవేరిపై అక్షింతలు చల్లి పూజలు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, ఆవాహిత దేవతారాధన, ధ్వజారోహణ, దీక్షాహోమం, బలిహరణ, సూర్యారాధన పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నిర్వహించిన మహా చండీ యాగం భక్తులను ఆకట్టుకుంది.
కమనీయం.. శనీశ్వరుడి కళ్యాణం
Published Thu, Feb 9 2017 10:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM
Advertisement