విజయనగరం : ఎంఈవో తప్పుడు రిపోర్టు ద్వారానే తమ గూడానికి కేటాయించిన పాఠశాల వెనక్కి వెళ్లిందని ఆరోపిస్తూ.. గ్రామస్తులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పొనుకువలస పంచాయితీ పరిధిలో పెదచీపురువలస గ్రామంలో విద్యర్థులతోపాటు వారి తల్లిదండ్రులు రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎంఈవో నిర్ణయంతో తమ గూడానికి చెందిన 43 మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.