తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు | Parents, strict action would be taken care | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు

Published Fri, Aug 12 2016 11:37 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎసై సంతోష్‌ - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎసై సంతోష్‌

  • ఎస్సై సంతోష్‌ 
  • తల్లి మతిచెందిన కేసులో ఐదుగురు కుమారులపై కేసు 
  • అశ్వాపురం : తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే కొడుకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై హెచ్చరించారు. శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండికుంట గ్రామానికి చెందిన కందిమళ్ల సరోజనమ్మ అనే వద్ధురాలు.. తన కుమారులు పట్టించుకోవడం లేదనే మనోవేదనతో ఏడ్చి, ఏడ్చి మతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ఆ వద్ధురాలు నిరాహార దీక్ష చేస్తూ మతిచెందడం బాధాకరమన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న విషయం ఆలస్యంగా తెలిసిందని, ఆలోపే ఆరోగ్యం క్షీణించి సొమ్మసిల్లి పడిపోయిందని, వైద్యశాలకు తరలిస్తుండగా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొండికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి పసుపులేటి కష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మతదేహాన్ని భద్రాచలంలో పోస్టుమార్టం అనంతరం గ్రామ పెద్దలకు అప్పగించామని తెలిపారు. ఉన్నతధికారుల ఆదేశాల మేరకు వద్ధురాలు మతిచెందడానికి కారణమైన ఐదుగురు కుమారులు కందిమళ్ల సుధాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కష్ణారెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్‌రెడ్డిలపై ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేశామని వివరించారు. ఐదుగురు కొడుకులు ఉండి ఎవరూ లేని అనాథలా వద్ధురాలు మతిచెందడం దారుణమని ఎస్సై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘనటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ ఎస్సై కిరణ్, ఏఎస్సై వీరబాబు, కానిస్టేబుళ్లు మంగీలాల్, ఝాన్సీ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 
     
    12 ఎంఎన్‌జి 26 : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎసై సంతోష్‌ 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement