-
కుటుంబ సభ్యుల ఆరోపణ
-
పోలీసుల అదుపులో అనుమానితులు
చిల్లకూరు : మద్యం దుకాణాల లావాదేవిల్లో విభేదాల కారణంగానే భాగస్వాములే తన భర్తను దారుణంగా హత్య చేశారని మండలంలోని తొణుకుమాల పంచాయతీ ఉడతావారిపార్లపల్లికి చెందిన మృతుడు గొడ్డటి కోటేశ్వరరావు (59) భార్య సుభాషిణి డీఎస్పీ శ్రీనివాస్‌కు తెలిపారు. గురువారం అర్ధరాత్రి కోటేశ్వరరావు హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై డీఎస్పీ శుక్రవారం విచారణ చేపట్టారు. మద్యం దుకాణ లావాదేవిల్లో 8 నెలలుగా విభేదాలు ఉన్నట్లు హతుడి భార్య సుబాషిణి వివరించింది. తన అన్న కుమారులైన జగదీష్, తులసి, అంజయ్యతో తన భర్త భాగస్వామ్యం ఉన్నాడని, సుమారు రూ.35 లక్షలు పెట్టుబడులుగా పెట్టి భాగస్వామిగా ఉంటున్నాడని, అయితే ఇటీవల కాలంలో పెట్టుబడులు తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతోనే తన అన్న కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు.
క్లూస్‌టీమ్, డాగ్ స్క్వాడ్ పరిశీలన
క్లూస్‌టీంతో పాటు, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి చుట్టపక్కల ఆదారాల కోసం ప్రయత్నించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాస్, సిఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
కోటేశ్వరరావు హత్యకు సంబంధించి అనుమానంపై అతనికి దగ్గర బంధువులైన బావమరిది, రమేష్, అతని కుమారులు తులసి, జగదీష్‌తో పాటు కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణ ంలో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.