సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి | Partners need a cultural revolution | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి

Published Sun, Sep 11 2016 8:10 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి - Sakshi

సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలి

నల్లగొండ టౌన్‌ : చైనా అక్టోబర్‌ సాంస్కృతిక విప్లవానికి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు, కళాప్రదర్శనలు నిర్వహించి భారత సాంస్కృతిక విప్లవంలో భాగస్వాములు కావాలని అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు పరకాల నాగన్న పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శ్రామిక భవన్‌లో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య  రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికవర్గ సాహిత్య, సాంస్కృతిక విప్లవంతో పాటు పల్లె సంస్కృతిని జానపద కళారూపాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయిక్రిష్ణ మాట్లాడుతూ సామ్రాజ్యవాద, ఫ్యూడల్‌ సాంస్కృతిక వ్యతిరేకంగా చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో అక్టోబర్‌ 1 నుంచి 7 వరకు సాంస్కృతిక పోరాటం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.గంగన్న, కె.సుబ్బారావు, చంద్రన్న, కోటకొండ కృష్ణ, ఉదయ్‌గిరి క్రిష్ణ, వెంకన్న, నిమ్మల రాంబాబు,  చందు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement