కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆదివారం గుండెపోటు మృతి చెందారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిట్టిబాబు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిట్టిబాబు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ఎన్ చిన్నరాజప్ప, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సంతాపం తెలిపారు. నేటి సాయంత్రం 4.00 గంటలకు పర్వత చిట్టిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని శంకవరంలో జరగనున్నాయి.