పట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు
-
పట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు
-
చేబ్రోలు మార్కెట్‌లో కిలో రూ.452
గొల్లప్రోలు (పిఠాపురం) :
ధర పలికింది. సీబీ(కోలార్‌చిన) రకం కిలో గూళ్లుపట్టుగూళ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజ¯ŒSలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేబ్రోలు పట్టుగూళ్ల మార్కెట్‌లో రెండు రోజులుగా రికార్డు ధరలకు గూళ్ల అమ్మకాలు జరిగాయి. పట్టు రైతుల రద్దీతో మార్కెట్ కళకళలాడుతోంది. మార్కెట్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో అత్యధికంగా రాజఒమ్మంగి మండలం కిండ్రకాలనీకి చెందిన గుమ్మిడి బెన్నమ్మకు చెందిన బైవోల్టి¯ŒS రకం గూళ్లకు కిలో రూ.452 రికార్డు రూ.330 వరకు ధర పలికాయి. బైవోల్టి¯ŒS కిలో సరాసరి రూ.390 నుంచి రూ.452 పలకడం ఈఏడాదిలో ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజుకు రెండు నుంచి నాలుగు టన్నుల గూళ్ల విక్రయాలు జరుగుతున్నట్టు మార్కెటింగ్ ఆఫీసర్ ఎ¯ŒS.సుదర్శనరావు తెలిపారు. రాయలసీమ, పశ్చిమగోదావరిజిల్లా ప్రాంతాల్లో దిగుబడులు తగ్గడంతో స్థానికంగా మంచి ధరలు లభిస్తున్నాయన్నారు. శిల్క్‌కు మంచి డిమాండ్ ఉండడంతో రీలర్లు సైతం పాటలో(కొనుగోలులో) చురుగ్గా పాల్గొంటున్నారు.