ఆలయం వద్ద పవన్‌కల్యాణ్
శ్రీవారి సేవలో పవన్ కల్యాణ్
Published Sat, Aug 27 2016 11:36 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM
సాక్షి, తిరుమల: సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శనివారం మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలకు వచ్చిన ఆయన సుఫథం ప్రవేశ మార్గం నుండి శ్రీవారి దర్శించుకున్నారు. తర్వాత శనివారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన స్వామివారిని మరోసారి దర్శించుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ లడ్డూ ప్రసాదాలు అందజేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తోపులాటలు నివారించారు. ఆలయం వెలుపల పవన్‌కల్యాణ్‌ను చేసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తర్వాత అతిథిగృహానికి చేరుకున్న ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతికి పయనమయ్యారు. ఈ సందర్భంగా అభిమానులతోపులాటల కారణంగా ఆయన తూలి కింద పడిపోతుండటంతో, భద్రతా సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
Advertisement
Advertisement