నిన్న నిండుకుండ.. నేడు వట్టికుండ..
నిన్న నిండుకుండ.. నేడు వట్టికుండ..
Published Wed, Aug 24 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
వర్షాకాలంలో సైతం వరుణుడు ముఖం చాటేశాడు. తొలకరిని చూసి సాగు చేసిన రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా ఎండమావులే తప్ప, నీటిజాడ కరువైంది. ఈ తరుణంలో కృష్ణా పుష్కరాలు వచ్చాయి. పుష్కరాల కోసం విడుదల చేసిన సాగర్‌జలాలు మండలంలోని సాగర్ కాలువల్లో దర్శనం ఇచ్చాయి. పుష్కర కాలంలో నిండుకుండలా దర్శనం ఇచ్చిన పెదనందిపాడు బ్రాంచి కెనాల్ (పీబీసీ కెనాల్) పుష్కరాల అనంతరం ఇలా వట్టిపోయి కన్పించింది. మండలంలోని లింగారావుపాలెం –మైదవోలు మధ్య కాలువ దృశ్యాలు ఇవి. – యడ్లపాడు
Advertisement