నత్తనడకనపింఛన్ల పంపిణీ
Published Sun, Apr 2 2017 11:33 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
ఆలమూరు :
పింఛన్ల పంపిణీలో తలెత్తుతున్న లోపాలను రాష్ట్ర ప్రభుత్వం సరి చేయకపోవడంతో పింఛ¯ŒSదారులు ప్రతి నెలా పడరాని పాట్లు పడుతున్నారు. గతంలో మాదిరిగానే ఈ నెలలో కూడా సర్వర్లు మొరాయింపు, నగదు సరఫరా చేయకపోవడంతో రెండు రోజుల నుంచి పింఛన్ల పంపిణీ నత్తనకడన సాగుతోంది. తొలి రోజు 14.85 శాతం మాత్రమే నమోదు కాగా రెండో రోజైన ఆదివారం అది 23.95 శాతానికి చేరింది. జిల్లాలోని కొన్ని మండలాలకు నగదు అందించకపోవడంతో అసలు పింఛన్ల పంపిణీయే ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి రూ.55 కోట్లు అవసరం కాగా, ప్రస్తుతం రూ.20 కోట్ల లోపు మాత్రమే విడుదల చేశారు. దీంతో కొన్ని మండలాల్లో పింఛన్ల పంపిణీ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. కొన్ని మండలాల్లో తీసుకున్న నగదు పూర్తిగా చెల్లించడంతో అధికారులు పింఛన్ల పంపిణీని నిలిపివేశారు. ఒకటో తేదినే పింఛ¯ŒS తీసుకుందామనుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, సాంకేతిక లోపాలతో పంచాయతీ కార్యాలయాల వద్ద రెండో రోజు కూడా పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఏర్పాటు చేసిన 74 యూనిట్లలో ప్రతి నెలా ఒకటి నుంచి ఐదులోపు పింఛన్లు పంపిణీ కావడం లేదు. ఒక్కో బయోమెట్రిక్ యంత్రం ద్వారా రోజుకు సుమారు 100 మందికి పంపిణీ చేయాల్సి ఉండగా కనీసం పదిమందికి కూడా పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 5,03,607 లక్షల మంది పింఛనుదార్లుండగా పంపిణీకి తొలి రోజైన శనివారం రాత్రి 7 గంటలకు 1,20,628 మందికే పంపిణీ చేయగలిగారు. వర రామచంద్రపురంలో అత్యధికంగా 65.09 శాతం, తాళ్లరేవు మండలంలో 0.1 శాతం నమోదైంది. ఆలమూరు మండలంలో కేవలం 1,852 మందికే పంపిణీ చేశారు తొమ్మిది మండలాల్లో పింఛన్ల పంపిణీ అసలు ప్రారంభమే కాలేదు. ఈ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీలో 23.95 శాతంతో జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది.
Advertisement
Advertisement