టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు | people bored in tdp govt | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు

Published Sat, Oct 22 2016 11:18 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు - Sakshi

టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు

మచిలీపట్నం టౌన్‌ : టీడీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు పేర్కొన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం స్థానిక డీసీసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. పళ్లంరాజు మాట్లాడుతూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ పరిశీలకులు షేక్‌ మస్తాన్‌ వలీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు కారుమంచి రమాదేవి,  నరహరిశెట్టి నరసింహారావు, మిరియాల రామకృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గుమ్మడి విద్యాసాగర్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు అన్వర్‌హుస్సేన్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాధికామాధవి పాల్గొన్నారు.
బయటపడ్డ విభేదాలు..
సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి రాధికామాధవిని ఇక్కడి నాయకులు గౌరవించటంలేదని, పీసీసీ ప్రధాన కార్యదర్శి మిరియాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోవటంలేదని, ఓ నియంతలా ఉంటుంటే ఆమెను మేం ఎలా గౌరవిస్తామని డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి బుల్లెట్‌ ధర్మారావు «ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితిపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement