అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లో శాశ్వత ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఈ నెల 7వ తేదీ ఆదేశాలు జారీ చేశారు. మీ కోసం కౌంటర్లలో రెండు గదుల్లో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆధార్‌కార్డుల్లో తప్పులు సరిచేయడంతోపాటు కొత్త ఆధార్‌కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకునే సౌలభ్యం కూడా కల్పించాలన్నారు. దీంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే ఆధార్‌కార్డుల్లో తప్పులను సరి చేస్తామని, లేకపోతే కుదరదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు.