వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష | Personal hygiene for health protection | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష

Published Sat, Feb 11 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష

వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష

దిలావర్‌పూర్‌: నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పాఠశాలలో ఎస్‌ఎంసీ చైర్మన్  నందముత్యం విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సీహెచ్‌వో రాజేశ్వర్‌పాండే, ప్రధానోపాధ్యాయు డు లక్షీ్మనారాయణగౌడ్, ఆసుపత్రి సూపర్‌వైజర్‌లు రత్నకుమారి, వేణురావు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్‌రూరల్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు అల్భెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా 300మంది విద్యార్థులకు మాత్రలు అందించామన్నారు. కార్యక్రమంలో నట్టల నివారణ  కన్వీనర్‌ గంగాధర్, అధ్యాపకులు తిరుపతి, రవీందర్, నాగేశ్వర్, సూర్యసాగర్, సత్యపాల్‌రెడ్డి, అనిల్, ప్రకాశ్, ఉమేశ్, నర్సయ్య, జాకీర్‌ హుస్సేన్, స్వరూపరాణి పాల్గొన్నారు.

లక్ష్మణచాంద: మండల కేంద్రంలోని సహకార జూనియర్‌ కళాశాలలో ఇన్ చార్జి అధ్యాపకులు ఎం .రాజేశ్వర్‌ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు సురేశ్, రాము, రవి, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిర్మల్‌రూరల్‌: ‘వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్ష’ అని బంగల్‌పేట్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి మాధవి అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాతర్ల గణేశ్, వైద్య సిబ్బంది రాములు, ఆశ కార్యకర్త భూదేవి, ఉపాధ్యాయులు రాంనరేశ్, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

సారంగాపూర్‌: పిల్లల్లో ప్రధానంగా నులిపురుగుల సమస్యల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి నుంచి రక్షించడానికి తప్పనిసరిగా  నట్టల నివారణ మందులను వేయించాలని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి అవినాష్‌ పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపరుగుల కారణంగా రక్తహీనత, పోషకాలలోపం, ఆకలి లేకపోవుట, బలహీనంగా మారడం, కడుపునొప్పి, తదితర సమస్యలు ఎదురవుతాయన్నారు.  ఎంఈవో మధుసూదన్, జామ్‌ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ రమాకల్యాణి, హెల్త్‌ సూపర్‌వైజర్‌ క్రిష్ణమోహన్ గౌడ్, ఏఎన్ సునీత, సిబ్బంది, పాల్గొన్నారు.  

నిర్మల్‌ టౌన్: నులిపురుగుల నివారణకు చిన్నారులకు అల్బెండజోల్‌ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఎంపీడీవో గజ్జారాం అన్నారు. మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఆయన చిన్నారులకు అల్బెండజోల్‌ మాత్రలు వేశారు. నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రను ప్రతీ ఆరునెలలకోసారి వేస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భీంరావు, ఈవోఆర్‌డీ మోహన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement