బాలుడి మృతి దురదృష్టకర ఘటనగా చిత్రీకరణ
అయిన వారితోనే విచారణ హడావుడిగా నివేదిక
20న పూనం మాలకొండయ్య రాక
‘ఈఎన్‌టీ’ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు
విశాఖపట్నం : ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృత్యువాతపడ్డ బాలుడి ఉదంతాన్ని దురదృష్టకరంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వైద్యుల తప్పేమీ లేదంటూ తేల్చేం దుకు సన్నాహాలు మొదలయ్యాయి. నగరంలోని పెదవాల్తేరు ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి పెందుర్తి మండలం పురుషోత్తపురానికి చెందిన మూడేళ్ల జయశ్రీకర్ మంగళవారం మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటి దాకా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో చనిపోయిన ఘటనలు లేవు. సాక్షిలో ప్రచురితమైన ఈ కథనంపై కలెక్టర్ ప్రవీ ణ్‌కుమార్ స్పందించారు. ఆంధ్రమెడికల్ కళాశాల (ఏఎంసీ) ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో,ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోకమిటీనియమించారు.
విచారణ తీరుపై సందేహాలు
ఎనస్థీషియా విభాగాధిపతి సత్యనారాయణ శుక్రవారం ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఆంధ్రామెడికల్ కళాశాల మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ, బాలుడికి మత్తు ఇచ్చిన వైద్యుడు వేణుగోపాల్ క్లాస్‌మేట్లని, శస్త్రచికిత్స చేసిన వైద్యుడు కృష్ణకిషోర్‌కు కమిటీ సభ్యుడైన డాక్టర్ సూర్యప్రకాష్ తోటి ఉద్యోగి కావడం విచారణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు నెలల కిందట కూడా
మూడు నెలల కిందట కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స వికటించి మరో బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిష్పక్షపాతం గా ఉండేందుకు మరో ఆస్పత్రి లేదా పొరుగు జిల్లా ఆస్పత్రుల వైద్యులతో విచారణ జరిపిస్తారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా కమిటీ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాఉండగా శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందిన విషయంపై తనకు ఎందుకు సమాచా రం ఇవ్వలేదని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ వద్దకు వెళ్లిన ఈఎన్‌టీ వైద్యులు తమ తప్పేమీ లేదని చెప్పుకున్నట్టు సమాచారం.
యూనిట్ రద్దు చేస్తాం!
ఈఎన్‌టీ ఆస్పత్రిలో వరుసగా చిన్నారులు మృత్యువాత పడుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న డీలిప్ ప్రతినిధులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. శుక్రవారం వీరు ఆస్పత్రిని సందర్శించి, గతంలో ఒక బాలుడు మరణించినప్పుడు మిన్నకున్నామని, ఇప్పుడు మరో చిన్నారి చనిపోవడాన్ని ఉపేక్షించబోమని, ఇకపై ఇలాంటివి పునరావృతమైతే కాక్లియర్ ఇంప్లాంట్ యూనిట్‌ను రద్దు చేస్తామని హెచ్చరించినట్టు భోగట్టా.
20న పూనం మాలకొండయ్య రాక..!
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు వికటించడాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆమె ఈనెల 20న విశాఖ వస్తున్నట్తు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి వర్గాల్లో కలవరం మొదలైంది.
సెలవుపై సూపరింటెండెంట్?
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఫెయిలై బాలుడు మరణించిన నేపథ్యంలో తలెత్తిన పరిణామాలతో ఆందోళన చెందుతున్న ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘునాథబాబు సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
తారుమారుకు ప్రణాళిక!
Published Sat, Feb 18 2017 3:31 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement