ప్రభాకర్‌తోపాటు ఆరుగురి అరెస్ట్
రూ.6.61 లక్షల నగదు స్వాధీనం
ఏసీపీ సురేంద్రనాథ్ వెల్లడి
వరంగల్: కాంగ్రెస్ నాయకుడు కొయ్యడ ప్రభాకర్ అలియాస్ కరాటే ప్రభాకర్ ఇంట్లో పేకాట ఆడుతుండగా ఏడుగురిని వరంగల్ ఏసీపీ సురేంద్రనాథ్ నేతృత్వంలో మిల్స్‌కాలనీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఏసీపీ కథనం ప్రకారం... వరంగల్ అండర్ బ్రిడ్జి శివనగర్ సమీపంలోని కరాటే ప్ర భాకర్ ఇంట్లో మూడు ముక్కల పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మిల్స్‌కాలనీ సీఐ వేణు, ఎస్సై రవీందర్, పీఎస్సై సాయన్న తనిఖీలు నిర్వహించారు.
ఇంటి రెండో ఫ్లోర్‌లో మద్యం తాగుతూ పేకాట ఆడుతున్న కరాటే ప్రభాకర్‌తోపాటు వరంగల్ నగరానికి చెందిన కూర మధూకర్, గుజ్జ నరేష్, బోడకుంటి రవిశంకర్, అడువాల సూర్యనారాయణ, పోతి రెడ్డి పాపిరెడ్డి, సాటింపు నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6లక్షల 61 వేల 910స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన ట్లు ఏసీపీ తెలిపారు. కాగా కరాటే ప్రభాకర్ గతంలో శ్రీనివాస ట్రస్ట్ క్లబ్ పెట్టి నడిపిస్తుండగా ఇంతెజార్‌గంజ్ పోలీస్టేషన్‌లో బైండోవర్ చేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పోలీ సులకు సమాచారం ఇవ్వాలని కోరారు.