రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ | police councelling of roudy sheeters | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌

Published Sun, Jul 9 2017 11:25 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

police councelling of roudy sheeters

రాయదుర్గం అర్బన్‌ : శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చలపతిరావు రౌడీషీటర్లను హెచ్చరించారు. ఆదివారం రాత్రి రాయదుర్గం పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని 26 మంది రౌడీషీటర్లకు, చెడు ప్రవర్తన కల్గిన వారిని ఎస్‌ఐ మహానంది స్టేషన్‌కు పిలిపించారు. ఈసందర్భంగా వారికి సీఐ చలపతిరావు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. గతంలో ఏమి చేశారో తెలియదని, ఇక నుంచి సత్ప్రవర్తన కల్గి ఉండాలని హెచ్చరించారు. ఆసాంఘిక కార్యక్రమాల్లో గాని, శాంతిభద్రతలకు గాని భంగం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement