విశాఖపట్నం: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వడ్డిమిట్ట వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహనం, లారీని మరో లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ ఆదిమూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాయుడు, హోంగార్డు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.