అరాచకం | Police Zulum on YSRC leaders | Sakshi
Sakshi News home page

అరాచకం

Published Mon, Jul 17 2017 1:48 AM | Last Updated on Tue, May 29 2018 6:01 PM

అరాచకం - Sakshi

అరాచకం

వైఎస్సార్‌ సీపీ నేతలపై పోలీసు జులుం
దేవరపల్లి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
శనివారం అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని గృహ నిర్బంధం
ఆదివారం ఉదయం ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అరెస్ట్‌
జిల్లా వ్యాప్తంగా పలువురు వైఎస్‌ఆర్‌సీపీనేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు
పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం
అధికారపార్టీ నియంతలా వ్యవహరిస్తోందంటూ నేతల ధ్వజం


 ఒంగోలు: జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శ్రుతిమించాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు. విపక్ష నేతలు ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఉండేందుకు  ఎమర్జె్జన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారు. మాట వినకుంటే అక్రమ కేసులు బనాయించి లోపల వేస్తామంటూ బెదిరింçపులకు పాల్పడుతున్నారు. ఆదివారం పర్చూరు మండలంలోని దేవరపల్లి దళితుల భూ వివాదాన్ని పరిశీలించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆ గ్రామాన్ని సందర్శించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న అధికారపార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలపై పోలీసులను ప్రయోగింపచేశారు. శనివారం అర్ధరాత్రి నుంచే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను అరెస్టులు చేయించి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా కీలకమైన నేతలను గృహ నిర్బంధంలో ఉండేలా చూశారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలో       నిర్బంధించారు.

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు ఒంగోలు ఒన్‌టౌన్‌ సీఐ రామారావు బాలినేనికి చెప్పారు. ఆదివారం సాయంత్రం వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. బాలినేని గృహ నిర్బంధం వార్త క్షణాల్లో జిల్లావ్యాప్తంగా వ్యాపించింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, పార్టీ సీనియర్‌ నేత పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, రేణు నాగరాజు తదితర నేతలు వెంటనే బాలినేని ఇంటికి చేరుకున్నారు. సింగరాజు వెంకట్రావు, పులుగు అక్కిరెడ్డిలను సైతం అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌లో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇరువురు నేతలు బాలినేనితో కలిసి ఆయన స్వగృహంలోనే ఉండటంతో వారిని కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు.

ఆదివారం ఉదయానికే బాలినేని నిర్బంధంతోపాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్త వ్యాపించడంతో మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి, దర్శి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నాయకులు చుండూరి రవిబాబు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, బడుగు కోటేశ్వరరావు, గంగాడ సుజాత, బడుగు ఇందిర, పోకల అనురాధ, చిన్నపరెడ్డి అశోక్‌రెడ్డి, సూరే మణికంఠారెడ్డి, యశ్వంత్‌వర్మ, కాకుమాను సునీల్‌రాజు, యనమల నాగరాజు, డీఎస్‌ క్రాంతికుమార్‌ తదితరులతోపాటు వందలాదిమంది నేతలు, కార్యకర్తలు బాలినేని గృహానికి చేరుకున్నారు. అధికారపార్టీ నియంతృత్వ పోకడలతోపాటు పోలీసుల చర్యలను ఈ సందర్భంగా ఖండించారు.

ఆదివారం ఉదయానికి దేవరపల్లిని సందర్శించేందుకు   వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరువ నాగార్జున బయలుదేరగా ఆయనను మార్గమధ్యలోనే పర్చూరు మండలంలోని బోడవాడ గ్రామం వద్ద సీఐ శ్రీనివాసులు అదుపులోకి తీసుకొని యద్దనపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పోలీసు స్టేషన్‌లోనే నిర్బంధించారు. నాగార్జునతోపాటు ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు డొక్కుమల్ల రవి, డేవిడ్, సుబ్బయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్‌ను శనివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రంవరకు ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లోనే నిర్బంధించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిని పోలీసులు ఒంగోలులోని ఆయన స్వగృహంలోనే ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గృహ నిర్బంధంలో ఉంచారు.

పర్చూరు నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్‌ను పోలీసులు దేవరపల్లిలో అదుపులోకి తీసుకొని ఇంకొల్లు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరితోపాటు పర్చూరు మండల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్‌ కృష్ణమోహన్, మాజీ ఎంపీపీ యద్దనపూడి హరిప్రసాద్, మార్టూరు మండల కన్వీనర్‌ కాలేషావలి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు ముకుందరావు, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీనివాస్, అనీల్, మస్తాన్‌వలి, సురేష్, సులేమా తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   పర్చూరు మాజీ ఎంపీపీ కొల్లా వెంకట్రావు తదితరులను అరెస్టు చేసేందుకు శనివారం అర్ధరాత్రి పోలీసులు వారి ఇళ్లవద్దకు చేరుకున్నారు. అయితే కొల్లా బాలినేనితో కలిసి దేవరపల్లి వెళ్లేందుకు ఒంగోలుకు  చేరుకొని ఆయనతోపాటు గృహ నిర్బంధంలో ఉండిపోయారు. అలాగే చీరాల నియోజకవర్గ  ఇన్‌చార్జ్‌ యడం బాలాజీ, పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జ్‌ వరికూటి అమృతపాణిలను అదుపులోకి తీసుకుని వేటపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement