ట్రైనీ ఎస్‌ఐ కుటుంబానికి పరామర్శ | politicians meet trainee SI family | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఎస్‌ఐ కుటుంబానికి పరామర్శ

Published Mon, Sep 26 2016 12:06 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

ట్రైనీ ఎస్‌ఐ కుటుంబానికి పరామర్శ - Sakshi

ట్రైనీ ఎస్‌ఐ కుటుంబానికి పరామర్శ

మిర్యాలగూడ: పట్టణంలోని రవీంద్రనగర్‌ కాలనీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ ఎస్‌ఐ తమ్మడబోయిన కిరణ్‌ కుటుంబాన్ని ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. కిరణ్‌ సోదరుడు సల్కునూరు ఎంపీటీసీ తమ్మడబోయిన అర్జున్‌ను ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైనీ ఎస్‌ఐ కిరణ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట మిర్యాలగూడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, మండల తహసీల్దార్‌ మాలి కృష్ణారెడ్డి, నాయకులు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి తదితరులున్నారు.
జూలకంటి పరామర్శ
ట్రైనీ ఎస్‌ఐ తమ్మడబోయిన కిరణ్‌ కుటుంబాన్ని ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆత్మహత్యకు గల కారణాలను కిరణ్‌ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కిరణ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు కిరణ్‌ భార్యకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఆత్మహత్యకు గల కారణాలను పూర్తి స్థాయిలో విచారించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆయన వెంట సల్కూనూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ కందిమళ్ల లక్షా్మరెడ్డి తదితరులున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement