లింగాలపల్లి(దమ్మపేట) : రాష్ట్రంలో ఖరీ దైన రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి లేదని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొం డివర్రె, లింగాలపల్లి, జమేదార్ బంజర్ పంచాయతీల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లింగాలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో జిల్లాలను విభజిస్తున్నామని చెప్పి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పాల నా సౌలభ్యం కోసం కాకుండా నాయకుల అభీష్టం మేరకే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా ప్రజాభిప్రాయాలను లెక్కలోకి తీసుకోలేదని ధ్వజమెత్తారు. రెండో విడతలో చేపట్టిన మిషన్ కాకతీయ పనులకే బిల్లులు చెల్లించని ప్రభుత్వం.. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం ఎలా చేస్తుందని ప్రశ్నించారు. గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు లంచాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేసే వారని.. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా ఉందని వాపోయారు.
కాగా.. ఇందిరమ్మ ఇళ్లు కురుస్తున్నాయని.. వానాకాలంలో ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తమకు గతంలో అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిందని, ఆ భూములను నేటికీ చూపలేదని పలువురు ఆయనకు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి, కలెక్టర్లకు లేఖలు రాస్తానని ప్రసాదరావు తెలిపారు. జమేదార్ బంజర్, లింగాలపల్లి పంచాయతీలను ఏజెన్సీలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఆయన వెంట కక్కిరాల రత్నాకరరావు, సున్నం నాగమణి, అంకత మహేశ్వరరావు, కంభం పాటి సత్యనారాయణ, వాసం శ్రీనివాసరావు, చిన్నశెట్టి సత్యనారాయణ, దారా శ్రీను, గట్ల వెంకటేశ్వరరావు, మద్దిశెట్టి సత్యప్రసాద్, తుమ్మా రాంబాబు ఉన్నా రు. కాగా.. మొండివర్రెలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ.జానీ ఇచ్చి న తేనీటి విందులో ఆయన పాల్గొన్నారు.
సామాన్యులు రాజకీయాలు చేసే పరిస్థితి లేదు
Published Tue, Dec 13 2016 3:21 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
Advertisement
Advertisement