టేకు మొక్కలు నాటుతున్న అధికారి రామ్‌లక్ష్మణ్
-
సీఎం ముఖ్య సలహాదారు రామ్‌లక్ష్మణ్
మిడ్జిల్: ప్రభుత్వం నిరుపేద ఎస్సీలకు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య మంత్రి ముఖ్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్‌లక్ష్మణ్ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తూర్ గ్రామంలో ప్రభుత్వం గతేడాది ముగ్గురు ఎస్సీ రైతులకు తొమ్మిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమిలో హరితహారంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండువేల టేకు మొక్కలను నాటుతుండగా, ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టేకు మొక్కలను పెంచడంతో అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్య, డీడీలు విజయ్‌కుమార్, సంధ్యారాణి,ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్ కష్ణ పాల్గొన్నారు.